గణపతి నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలి.
- డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
- వాహన ధ్రువపత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి : ఇన్స్పెక్టర్. బి. సునీల్ కుమార్
ఆదిలాబాద్ జిల్లా : గణపతి నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బి. సునీల్ కుమార్ సూచించారు. ఈరోజు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో సుమారు 70 మంది ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ప్రతి డ్రైవర్ వాహనానికి సంబంధించిన నిజమైన ధ్రువపత్రాలతో పాటు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలన్నారు. నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం సేవించి ట్రాక్టర్ నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గణపతి విగ్రహం ట్రాక్టర్‌పై ఉన్న సమయంలో విద్యుత్ వైర్లు, లైట్లు, చెట్లు తదితరాలను గమనిస్తూ అత్యంత జాగ్రత్తగా వాహనం నడపాలని సూచించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ప్రతి డ్రైవర్ తన ట్రాక్టర్‌తో అందుబాటులో ఉండాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా పూర్తి అయ్యేంతవరకు సహకరించాలని తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


