విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కుసుమ రమేష్
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) స్టేషన్ ఘన్‌పూర్ మండల విద్యాశాఖ అధికారిగా మున్సిపల్ కేంద్ర శివునిపల్లి గెజిటెడ్ ప్రధానోపా ధ్యాయులు కుసుమ రమేష్ బుదవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విద్యాశాఖను బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేస్తానని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే చేర్పించాలని కోరారు. బాధ్యతలు స్వీకరించిన రమేష్ కు ఎమ్మార్సీ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


