14వవార్డు మున్సిపల్ బరిలో బోజు రమారవీందర్

హుస్నాబాద్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల వాతావరణం రోజుకు వేడెక్కుతున్న తరుణంలో మున్సిపల్ ఎన్నికలలో తీవ్ర పోటీ నెలకొంది.ఈసారి హుస్నాబాద్ మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో బోజు రమారవీందర్ పోటీ చేస్తున్నారు.మున్సిపల్ రాజకీయాల్లో రమారవీందర్ తనదైన శైలిలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో వార్డు ప్రజల్లో రమా రవీందర్ కు మంచి పేరు ఆదరణ ఉండటముతో గెలుపు ఖాయమని ప్రజలు తెలిపారు.చాలా సంవత్సరాల నుండి బిఆర్ఎస్ పార్టీలో ఉండి గతంలో కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం ఉండటం పట్టణ సమస్యలపై అర్థం చేసుకోవడం వాటి పరిష్కారాలు సూచించడం, సమస్యలపై అవగాహన ఉందని వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని నమ్మకం ప్రజల్లో విశ్వాసం ఏర్పడింది. రమా రవీందర్ కి అన్ని వర్గాల ప్రజలతో అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు.వార్డులో తిరుగుతూ ప్రజల మద్దతు కల్పించాలని కోరుతున్నారు త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందేందుకు ప్రజల సహకారం కావాలని ప్రణాళిక వైపుగా సాగుతున్నారు.వారి పయనం విజయపతంలోకి రావాలని కౌన్సిలర్ గా విజయదుందుభి మోగించాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ప్రధాన సమస్యలు వార్డులో ,ప్రధాన రహదారిలోని దుకాణాలలో వరద నీరు రాకుండా చర్యలు, డ్రానేజీలు, సీసీ రోడ్లు ఏర్పాటు చేస్తామన్నారు. రమా రవీందర్ ని కౌన్సిలర్ గా గెలిపిస్తే ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తామని ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తామని వార్డు సమస్యలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇస్తామని అభిప్రాయం వ్యక్తం చేశారు. వార్డ్ ప్రజలకు మంచి చేయాలని తపనతో ముందుకు నిస్వార్థంగా ప్రజలకు పాలన అందించుటకు ముందుకు వస్తున్నామని మేము వేయబోయే అడుగులకు దారి మీ ఓటు అనిమమ్మల్ని ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపించుకోగలరని వార్డు ప్రజలను కోరుతున్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


