కేతపల్లి లో రికార్డు బ్రేక్....రూ.2.75లక్షలు లడ్డూ వేలం
నాంపల్లి మండలం కేతపల్లిలో శ్రీ రాఘవేంద్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కేతపల్లిలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూ వేలం పాట ఉత్సాహంగా జరిగింది. భక్తులు ఆసక్తిగా పాల్గొన్న ఈ వేలం పాటలో వినాయకుడి లడ్డూకు అత్యధికంగా కేతపల్లిలో రికార్డ్ బ్రేక్ రూ.2.75లక్షల ధర పలికింది.ఈ వేలం పాటలో కర్నాటి రామారావు తండ్రి వెంకయ్య రూ.2.75 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. వినాయకుడి ఆశీస్సులతో తమ కుటుంబానికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ లడ్డూను వేలంలో సొంతం చేసుకున్నట్లు తెలిపారు. వేలం పాటను వీక్షించేందుకు గ్రామస్థులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కేతపల్లిలో వినాయక ఉత్సవ సందడి నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


