జాలిగామ అంగన్‌వాడీ కేంద్రం సందర్శించిన సర్పంచ్
సిద్దిపేట జిల్లా/గజ్వేల్ : సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం 1ని గురువారం నాడు గ్రామ సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భవానితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలో 'ఆరోగ్యలక్ష్మి' కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం అంగన్‌వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలు, పిల్లల కోసం వండిన భోజన పదార్థాల నాణ్యతను, రుచిని వారు స్వయంగా పరిశీలించి తనిఖీ చేశారు. వంటలు బాగున్నాయని సంతృప్తి వ్యక్తం చేస్తూ... ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్క గర్భిణీ, బాలింత, పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సునీత సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు చిట్యాల ఎల్లం, స్వామి, అంగన్‌వాడీ టీచర్లు సునీత, అనిత, ఆయా రాజేశ్వరిలతో పాటు స్థానిక మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


