ఆంగ్ల పరిశోధకురాలు జాల. శ్రీలక్ష్మీ కి పిహెచ్ డి ప్రదానం

ఆంగ్ల పరిశోధకురాలు జాల. శ్రీలక్ష్మీ కి పిహెచ్ డి ప్రదానం

 

 హనుమకొండ. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్ ఇంగ్లీష్ విభాగం పరిశోధకురాలు జాల శ్రీలక్ష్మి కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డీ.) ఇన్ ఇంగ్లీష్ ప్రదానం ప్రధానం చేయబడిందని కాకతీయ విశ్వవిద్యాలయ పరీక్ష నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ తెలిపారు. జాల శ్రీలక్ష్మి కాకతీయ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగాధిపతి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఆర్. మేఘనా రావు పర్యవేక్షణలో  కల్చరల్ డిస్‌ప్లేస్‌మెంట్స్ అండ్ హైబ్రిడిజం ఇన్ రైటింగ్స్ ఆఫ్ చేతన్ భగత్ అనే అంశంపై చేసిన పరిశోధన గాను పీహెచ్డీని ప్రధానం చేయడం జరిగింది. ఎం ఏ ఆంగ్ల సాహిత్యాన్ని మరియు ఎం ఏ సైకాలజీ ని, ఎం ఎస్ సి యోగా, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఏం పిల్ ని పూర్తి చేసి చేసింది. 20 సంవత్సరాల బోధన అనుభవం ఉంది.  విద్యాసంస్థలలో మోటివేషనల్ స్పీకర్ గా, వ్యక్తిత్వ వికాసానికి యోగా కార్యక్రమాలు నిర్వహించడం తోపాటు అనేక ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది. జాల శ్రీలక్ష్మి ప్రస్తుతం కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ డిగ్రీ కళాశాలలో ఆంగ్ల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. శ్రీలక్ష్మీ పీహెచ్డీ పూర్తి చేసిన సందర్భంగా భర్త చంద్రశేఖర్ మరియు పరిశోధన విద్యార్థులు అభినందనలు తెలిపారు.

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News