పీఎం సూర్య ఘర్‌తో సౌర విద్యుత్‌ సద్వినియోగం

పీఎం సూర్య ఘర్‌తో సౌర విద్యుత్‌ సద్వినియోగం

  • గృహ విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చు
  • సేవా సేతు కార్యక్రమంలో అవగాహన సదస్సు

నిర్మల్ జిల్లా, : గృహ వినియోగదారులు సౌర విద్యుత్‌ను సద్వినియోగం చేసుకుని విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవాలని విద్యుత్‌, బ్యాంకింగ్‌ శాఖల అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘పీఎం సూర్య ఘర్‌–ముఫ్త్‌ బిజ్లీ యోజన’ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం నిర్మల్‌ పట్టణంలోని విద్యుత్‌ శాఖ కార్యాలయంలో సేవా సేతు కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. పథకం కింద గృహాలపై రూఫ్‌టాప్‌ సౌర విద్యుత్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సొంత అవసరాలకు విద్యుత్‌ ఉత్పత్తి చేసుకోవడంతో పాటు విద్యుత్‌ బిల్లుల భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ, రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు విధానం, దరఖాస్తు ప్రక్రియ, బ్యాంకు రుణ సదుపాయాలపై వినియోగదారులకు వివరించారు. పథకం ప్రయోజనాలు అర్హులైన ప్రతి గృహ వినియోగదారుడికి చేరేలా విద్యుత్‌, బ్యాంకింగ్‌ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సౌర విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉన్నవారికి దరఖాస్తు విధానం, అవసరమైన పత్రాలపై పూర్తి సహకారం అందించాలని తెలిపారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు బ్యాంకులు సకాలంలో రుణ సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్‌ వినియోగం వల్ల సంప్రదాయ విద్యుత్‌పై ఆధారపడటం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని అధికారులు వివరించారు. ప్రజలు పథకంపై పూర్తి అవగాహన పెంచుకుని అందుబాటులో ఉన్న ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్‌పీడీసీఎల్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ నాగరాజు, జిల్లా లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రామ్‌గోపాల్‌, టౌన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌తో, విద్యుత్‌, బ్యాంకింగ్‌ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News