హుస్నాబాద్ మండలంలో విజయవంతంగా ప్రారంభమైన సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం
హుస్నాబాద్ :ప్రభుత్వ ఆదేశాల మేరకు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం గురువారం రోజున విజయవంతంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో మండలంలోని పాఠశాలలలో PP–V తరగతుల విద్యార్థులు 998 మంది ఉండగా, వారిలో 920 మంది, అలాగే VI–XII తరగతుల విద్యార్థులు 1208 మంది ఉండగా, వారిలో 1145 మంది అల్పాహారం( టిఫిన్ మరియు పాలు)స్వీకరించారు.అదేవిధంగా, పాఠశాలలలో విధులు నిర్వహిస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బంది మొత్తం 95 మంది ఉండగా, వారిలో 96 మంది ఈ రోజు అల్పాహారం తీసుకున్నారు. మండలంలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, వంట సిబ్బంది సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. విద్యార్థులు సకాలంలో పాఠశాలకు హాజరై పౌష్టికాహారంతో కూడిన అల్పాహారం స్వీకరించడం ద్వారా వారి ఆరోగ్యం, ఏకాగ్రత మరియు విద్యా ప్రగతికి ఈ పథకం దోహదపడుతుందని మండల విద్యాధికారి బండారి మనిల తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు మరియు సంబంధిత అధికారులను మండల విద్యాధికారి అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


