ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో డిజిటలైజేషన్ వేగవంతం చేయాలి

  • నిర్ణీత గడువులోగా సమగ్ర ఓటర్ల జాబితా సవరణ పూర్తి చేయాలి
  • వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి
  • అధికారులను అప్రమత్తం చేసిన జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య.

నస్పూర్(మంచిర్యాల): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో డిజిటలైజేషన్‌ను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈ.ఆర్.ఓలు, ఎ.ఈ.ఆర్.ఓలు, ఎన్నికల విభాగం అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతి, మ్యాపింగ్ కాని ఓటర్లు, అనమలిస్‌ జాబితాలో నమోదైన ఓటర్లకు నోటీసుల జారీ, వారి ఇళ్లకు వెళ్లి ధ్రువపత్రాల సేకరణ, వివరాల డిజిటలైజేషన్ వంటి అంశాలపై ఉన్నత స్థాయి సమీక్ష చేపట్టారు. నోటీసులు అందుకున్న ఓటర్ల ఇళ్లకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్‌ఓలు) స్వయంగా వెళ్లి అవసరమైన పత్రాలను సేకరించాలని సూచించారు. ఎ.ఈ.ఆర్.ఓలు క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ, నిర్ణీత గడువులోగా పారదర్శకంగా పనులు పూర్తి చేసేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

జిల్లాలో పర్యవేక్షణ ముమ్మరం: అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య జిల్లా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా నోటీసులు జారీ అయిన ఓటర్ల వద్ద నుంచి ధ్రువీకరణ పత్రాలను సేకరించి, వెంటనే పోర్టల్‌లో డిజిటలైజ్ చేసేలా చర్యలు ముమ్మరం చేయాలని క్షేత్రస్థాయి యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాసరావు, ప్రత్యేక ఉపపాలన అధికారి చంద్రకళ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, ఎఈఆర్‌ఓలు, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Views: 27

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News