రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఓదెల హైస్కూల్ విద్యార్థులు.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఓదెల హైస్కూల్ విద్యార్థులు.

ఎంపికైన క్రీడాకారులను అభినందించిన ఓదెల సర్పంచ్ కనికి రెడ్డి సతీష్

ఓదెల : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారు.పేరం అక్షయ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు,బీరం అరవింద్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికైన వారిలో ఉన్నారు. పోటీలకు ఎంపికైన క్రీడాకారులను స్థానిక సర్పంచ్ కనికి రెడ్డి సతీష్ అభినందించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ. విద్యార్థులుఇదే స్ఫూర్తితో క్రీడల్లో రాణించి జాతీయస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్నారు.పాఠశాల పీఈటి రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ. ఎంపికైన విద్యార్థులు అక్టోబర్ 2,3 4,5 తేదీలలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలలో పాల్గొంటారన్నారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించి,రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News