వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
- మాజీ ఎంపీటీసీ లింగాల శ్రీనివాస్
- అక్కన్నపేట మండల బీఆర్‌ఎస్ నాయకులు
అక్కన్నపేట : హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలను అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ, అక్కన్నపేట మండల బీఆర్‌ఎస్ నాయకులు లింగాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సతీష్ కుమార్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా లింగాల శ్రీనివాస్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సతీష్ కుమార్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, సతీష్ కుమార్ అభిమానులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు, జై సతీష్ కుమార్ అంటూ నినాదాలు చేశారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


