నీటి వృథాను అరికట్టి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి.

నీటి వృథాను అరికట్టి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలి.

మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషా సతీష్

ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం పురపాలక శాఖ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులతో నీటి వినియోగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మినరల్ వాటర్ ప్లాంట్ల యజమానులకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూషా సతీష్ మాట్లాడుతూ, మినరల్ వాటర్ ప్లాంట్లలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రతి ప్లాంట్ యజమాని ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ప్లాంట్ల నుంచి వెలువడే వ్యర్థ నీటిని వృథాగా వదలకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి వాటిలోకి మళ్లించాలని తెలిపారు. రానున్న ఎండాకాలంలో నీటి సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రతి ప్లాంట్ వద్ద ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకొని భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని ఆమె కోరారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ భవిష్యత్ తరాలకు నీటి కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎస్. రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మినరల్ వాటర్ ప్లాంట్ యజమానులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ