విద్యాలయం ముసుగులో కల్లు సామ్రాజ్యం?
నిజామాబాద్‌లో కార్మికుల బతుకులను బలిగొంటున్న 'ఆ నలుగురి' ఆధిపత్యం.
విద్యా సంస్థ నడుపుతూనే కల్లు డిపోల గుత్తాధిపత్యం.
75 లక్షల షేర్లు విక్రయించి డబ్బులు, వడ్డీ ఇవ్వకుండా మోసం చేసిన వైనం.
కల్తీ మత్తులో అమాయక ప్రజల ఆరోగ్యం గుల్ల.
కోట్ల రూపాయల అక్రమ దందా.
...రాజకీయ పెత్తనం అడ్డుపెట్టుకుని కార్మికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైనం.
నిజామాబాద్ : భవిష్యత్ తరాలను తీర్చిదిద్దాల్సిన విద్యా దేవాలయాలు ఇపుడు అక్రమ దందాలకు అడ్డాగా మారుతున్నాయా? సమాజానికి విజ్ఞానాన్ని పంచాల్సిన విద్యా సంస్థల నిర్వాహకులే, అటువైపు మరో కాలు చాపి మత్తు పదార్థాల సామ్రాజ్యాన్ని శాసిస్తున్నారా? నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో పరిధిలో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు అక్షరాలా ఇదే నిజాన్ని నిగ్గదీస్తున్నాయి. నగరంలోని మూడవ కళ్ళు డిపో లో 'నాలుగు స్తంభాల ఆట' ఒక విద్యా సంస్థను నడుపుతూ విద్యాబుద్ధులు నేర్పుతున్నామంటూ గొప్పలు చెప్పుకునే యజమానులే, తెరవెనుక కల్లు డిపోల దందాను నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన చేతులే, కల్తీ మత్తును అమ్ముతూ అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటo అమాడుతున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.-విద్యా సంస్థ ముసుగులో కల్లు సిండికేట్ ఆధిపత్యం
నగరంలోని మూడవ కల్లు డిపోకు చెందిన నాలుగు స్తంభాల ఆటలో కొందరు వ్యక్తులు చక్రం తిప్పుతున్నారు. ఇక్కడ విద్యా సంస్థను నడుపుతున్న ఒక ప్రధాన యజమాని, తెరవెనుక కల్లు డిపోల భాగస్వామిగా కొనసాగుతూ తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. విద్యా రంగానికి ఒక పవిత్రత ఉంటుంది. కానీ, అదే ముసుగును అడ్డుపెట్టుకుని మరోవైపు కల్తీ కళ్ళు వ్యాపారానికి పాల్పడుతున్నారనే ఆరోపణలు రావడం అత్యంత ఆందోళనకరం. 'డైజో ఫామ్' పేరుతో సాగుతున్న ఈ వ్యవహారంలో అసలు కల్లు తయారీ, దాని వెనుక జరుగుతున్న రసాయనాల మత్తు దందాపై ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి.
- కల్తీ మత్తులో జనాల ప్రాణాలు :అడ్డగోలు దందా
సాధారణంగా చెట్టు నుంచి వచ్చే అసలు కల్లుతో వైన్ తయారీ లేదా సహజ సిద్ధమైన కల్లు దొరకడం గగనమైపోయింది. కానీ, ఇక్కడ తయారవుతున్నది అసలు సిసలైన కల్లు కాదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 'డైజో ఫామ్' అసలు కలుపంది కల్లు తయారు కాదని, ఒక వేళ తయారు చేసినా ఆ కల్లును సాధారణంగా ఎవరూ తాగే పరిస్థితి ఉండదని స్థానికులు వాపోతున్నారు. రకరకాల మత్తు పదార్థాలు, కెమికల్స్ కలిపి కృత్రిమంగా తయారు చేస్తున్న ఈ కల్తీ కల్లుకు ప్రజలను అలవాటు చేసి, వారి ఆరోగ్యాలతో చెలగాటo అడుతున్నారనే ఆరోపణలు ఆకాశాన్ని అంటాతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం నగరంలో 21 బట్టీలు ఉండాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో కేవలం 12 బట్టీలు మాత్రమే నడుస్తున్నట్లు తెలుస్తోంది. చెట్ల కళ్ళు తీసి విక్రాయించాలి. కళ్ళు డిపో నడపాలంటే ఈత, తాటి చేట్లు ఉండాలి. వీలుళ్ళు మాత్రం కామారెడ్డి జిల్లా నుండి తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుండైనా ఈ కల్లును రవాణా చేసుకునే వెసులుబాటు ఉందని చెబుతూ, కామారెడ్డి వైపు నుంచి కల్లును తీసుకొస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. రోజుకు ఎంత ప్యూర్ కల్లు వస్తోంది? దాంట్లో ఎంత మోతాదులో మత్తు పదార్థాలు కలుపుతున్నారు? అనేదానికి మాత్రం అసలు లెక్కలే లేకుండా పోయాయి. కేవలం ఒక్కొక్కరి సంపాదన నెలకు లక్షల్లో ఉంటుందంటే ఈ దందా ఏ స్థాయిలో వేర్లును లోతుగా పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
- 75 లక్షల మోసం.. షేర్లు అమ్మి మోసగించిన వైనం
ఈ కల్లు డిపోల గుత్తాధిపత్యంలో ఆర్థిక మోసాలు కూడా బయటపడుతున్నాయి. నాగరాజు గౌడ్ అనే వ్యక్తికి చెందిన 75 లక్షల రూపాయల విలువైన షేర్లను విక్రయించుకున్న సదరు నిర్వాహకులు, ఆ తరువాత బాధితుడికి రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా, కనీసం వడ్డీ కూడా చెల్లించకుండా దగా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తనకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ, డబ్బులు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. కార్మికుల సంక్షేమం కోసం ఉండాల్సిన సొసైటీని సైతం తమ కనుసన్నల్లో ఉంచుకుని, 'ఆ నలుగురు' వ్యక్తులు మాత్రమే సర్వాధికారాలు చెలాయిస్తున్నారు.
- రాజకీయ పెత్తనం : కార్మికులపై దోపిడీ
ఈ మొత్తం సిండికేట్ వెనుక బలమైన రాజకీయ పెత్తనం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రాజకీయ అండదండలతోనే కార్మికుల సొసైటీని తమ గుప్పిట్లో ఉంచుకుని కోట్ల రూపాయలకు పడగలెత్తారు. చెమటోడ్చి పనిచేసే అమాయక కార్మికులకు మాత్రం అరకొర వేతనాలు ఇస్తూ, ప్రశ్నిస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. లక్షలాది రూపాయలు సంపాదిస్తున్న ఆ డిపోల యజమానులు కార్మికుల కష్టాన్ని దోచుకుంటూ విపరీతమైన ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని స్వయంగా ఆ డిపోలో ఉన్న సభ్యులే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా బుద్ధులు నేర్పి భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన స్థానంలో ఉంటూ, మరోవైపు కల్తీ మత్తు పదార్థాల దందాతో యువతను, ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ దందాలపై సంబంధిత అధికారులు వెంటనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోట్ల రూపాయలు దండుకుంటూ నిబంధనలకు తూట్లు పొడుస్తున్న ఈ కల్లు సామ్రాజ్యంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు, కార్మికులు కోరుతున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


