అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి


ఆదిలాబాద్ బ్యూరో :మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, ఆదిలాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన 'అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం - 2026' కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. జిల్లా కలెక్టర్ రాజర్షి షా మరియు మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష సతీష్, డి డబ్ల్యూ ఓ మిల్కాతో కలిసి  ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వయోవృద్ధుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వయోవృద్ధులను సత్కరించడంతో పాటు, సమాజ సేవలో అంకితభావంతో ముందుకు సాగుతున్న ఆదిలాబాద్ ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి ని సంఘం నాయకులు మరియు వయోవృద్ధులు శాలువా కప్పి, ఘనంగా సన్మానించి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, సంఘం అధ్యక్షులు దేవిదాస్ దేశ్‌పాండే, జనరల్ సెక్రటరీ రామ్‌‌కులకర్ణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ శేషికాంత్, కె. లక్ష్మా రెడ్డి, సీనియర్ ప్రతినిధులు సుధాకర్, కె. శివ్వన్న, ఎం. గంగాధర్, సి. లక్ష్మా రెడ్డి తదితరులతో పాటు వయోవృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News