దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి 

దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న కేసులు స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి 

  • దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కరించాలి 
  •  స్టేషన్ రికార్డుల్లో ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలి..
  • సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలి.
  • జిల్లా ఎస్పీ పరితోష్  పంకజ్

కంగ్టి, : స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్,అన్నారు.వార్షిక తనిఖీలలో భాగంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, బుధవారం  సిర్గాపూర్,పోలీస్ స్టేషన్ కంగ్టి సర్కిల్ కార్యాలయాన్ని సందర్శించి కార్యాలయ పరిశుభ్రత, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మిస్సింగ్, ఎన్.బి.డబ్ల్యూ కేసుల ఛేదనకు సర్కిల్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ నిషేధిత గంజాయి అక్రమ రవాణా, సాగుపై కఠినంగా వ్యవహరించాలని, గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించిన వ్యవసాయ భూములను చట్టపరమైన నిబంధనల మేరకు జప్తు చేసేందుకు సిఫారసు చేయాలని అధికారులకు సూచించారు. నేరాల ఛేదన, నియంత్రణలో కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరించి, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా దాబాలు, పెట్రోల్ బంకుల ఎంట్రీ, ఎగ్జిట్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా సంబంధిత యజమానులకు సూచించాలని అధికారులను ఆదేశించారు.సర్కిల్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్వహణ, రికార్డుల నిర్వహణ సంతృప్తికరంగా ఉన్నాయని పేర్కొన్న జిల్లా ఎస్పీ, అధికారులు, సిబ్బంది పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు.ఈ వార్షిక తనిఖీల సందర్భంగా జిల్లా ఎస్పీ వెంట నారాయణఖేడ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి, కంగ్టీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్‌ఐ మహేష్, సర్కిల్ ఎస్‌ఐలు పోలీస్ సిబ్బంది ఉన్నారు. పెండింగ్ లేకుండా చూడాలి..  

Views: 14

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News