చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
తప్పుడు నివేదిక పంపిన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్
చిలిపిచెడ్: (మెదక్ జిల్లా) మండల సర్వసభ్య సమావేశంలో చిలిపిచెడ్ సర్పంచ్ జూల అనిల్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త తహసీల్దార్ కార్యాలయం కోసం తప్పుడు నివేదిక పంపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సమావేశంలోనే అధికారులను నిలదీసిన సర్పంచ్
శీలంపల్లి గేటు వద్ద ప్రపోజ్ చేసిన భూమి వాస్తవంగా దొడ్ల మాధవ రెడ్డి, తండ్రి నారాయణ రెడ్డి స్వాధీనంలో ఉందని, అది గ్రామంలో అందరికీ తెలుసని సమావేశంలోనే అధికారులను నిలదీశారు. తెలిసి కూడా కావాలనే ఆయన పేరు దాచిపెట్టి, అదే భూమి దుష్యంత్ రెడ్డి, ధర్మారెడ్డి, భూపాల్ రెడ్డిలకు చెందినదిగా తప్పుడు నివేదిక తయారు చేసి కలెక్టర్ గారికి పంపారని ఆరోపించారు.
రేపు కోర్టు చిక్కులు వస్తే అధికారులదే బాధ్యత
ఇలాంటి తప్పుడు నివేదికల వల్ల రేపు కోర్టు కేసులు వచ్చి భవన నిర్మాణం ఆగిపోతే దానికి పూర్తి బాధ్యత తప్పుడు నివేదిక పంపిన అధికారులదే అవుతుందని సమావేశంలో హెచ్చరించారు. అభివృద్ధిని కావాలనే అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
BNS కింద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి
ఇది చిన్న పొరపాటు కాదని, BNS సెక్షన్ 198, 217, 318(4), 336, 338, 340 కింద 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే నేరమని అన్నారు. కేవలం మెమోలు, శాఖపరమైన చర్యలు కాకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే సర్వే నెం.385 లోని రైతు వేదిక 20 గుంటల భూమికి వెంటనే హద్దు రాళ్ళు వేయాలని సమావేశంలో తీర్మానం చేయాలని కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

