విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో చేడినవిద్యుత్  ట్రాన్స్ ఫార్మర్

విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో చేడినవిద్యుత్  ట్రాన్స్ ఫార్మర్


అందోల్  ; మెదక్ జిల్లా అల్లాదుర్గం మండల కేంద్ర శివారు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా గురువారం ఉదయం11 గంటల ప్రాంతంలో భగ్గుమంది. క్షణాల్లోనే భారీ మంటలు, దట్టమైన నల్లటి పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఒక్కసారిగా చెలరేగిన మంటలతో పొలంలో పనిచేస్తున్న రైతులు హడలిపోయారు. అదృష్టవశాత్తు పెను ప్రమాదం తప్పింది.శిథిలావస్థకు చేరిందని, నిప్పురవ్వలు వస్తున్నాయని, ప్రమాదకరంగా మారిందని గత రెండు నెలలుగా విద్యుత్ అధికారుల చుట్టూ తిరిగిన కనీసం పట్టించుకున్న పాపాన పోలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యపు కోణమే ఈ దుర్ఘటనకుకారణమని రైతులు మండిపడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వరి పొలాలు నీరు లేక ఎండిపోతున్నా యని, వెంటనే అధికారులు స్పందించి కొత్త ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని అధికారులకు హెచ్చరిస్తున్నారు.

Views: 24

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News