రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు.
నిజామాబాద్ : రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని మేయర్ ఉమారాణి పేర్కొన్నారు. నగరంలో మెప్మా ఆధ్వర్యంలో శ్రద్ధానంద్ గంజ్, జీజీ కళాశాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. మద్దతు ధర పొందాలి. కేంద్రాలను ప్రారంభించిన అనంతరం మేయర్ మాట్లాడుతూ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయిస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు తమ ఉత్పత్తిని సులభంగా అమ్ముకునేందుకు ఈ కేంద్రాలు ఉపయోగపడతాయని ఆమె అన్నారు. మున్సిపల్ కమిషనర్ది లీప్ కుమార్ మాట్లాడుతూ.. మెప్మా ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా రైతులకు పారదర్శకంగా సకాలంలో చెల్లింపులు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది రైతులకు కేంద్రాల వద్ద పాటించాల్సిన విధివిధానాలు, అవసరమైన పత్రాలు కొనుగోలు ప్రక్రియ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


