పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 

మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ ర్ వి కె నారాయణపేట కోఆర్డినేటర్ డా. ఈటెల సత్యనారాయణ మాట్లాడుతూ, మాగనూర్ పీఏసీఎస్‌ ద్వారా చేపడుతున్న వరి విత్తనోత్పత్తి కార్యకలాపాలపై పరిచయ ప్రసంగం చేశారు. నాణ్యమైన విత్తనోత్పత్తి ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించడంతో పాటు, స్థానికంగా నాణ్యమైన విత్తనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా J. చంద్రశేఖర్,ADSC  మాట్లాడుతూ..వరి నాట్లు వేయడం నుంచి పంట కోత వరకు నాణ్యమైన విత్తనోత్పత్తిలో పాటించాల్సిన ప్రతి అంశాన్ని వివరించారు. విత్తన ఎంపిక, నాట్లు, కలుపు మరియు తెగుళ్ల నియంత్రణ, ఇతర రకాల మొక్కల తొలగింపు, పంట పర్యవేక్షణ, కోత మరియు నిల్వ వంటి అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. విత్తనోత్పత్తిని రైతులకు వ్యాపార నమూనాగా అభివృద్ధి చేసుకోవడం ద్వారా స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో మాగనూర్ పీఏసీఎస్‌ చైర్మన్ వెంకట్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి సుదర్శన్ గౌడ్ ,, AEO అనిల్, పీఏసీఎస్‌ CEO గోవర్ధన్ రెడ్డి, డి ఆంజనేయులు, పి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 15

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ