బీసీ హక్కుల సాధన సమితి మహాసభలను విజయవంత చేయండి
జిల్లా మహాసభల కరపత్రాల ఆవిష్కరణ
నల్లబెల్లి(వరంగల్ జిల్లా): ఈ నెల 16న వరంగల్ పట్టణంలోని శిలానగర్ రాజశ్రీ గార్డెన్‌లో నిర్వహించనున్న బీసీ హక్కుల సాధన సమితి 2వ జిల్లా మహాసభలను బీసీలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి చింతకింది కుమారస్వామి కోరారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బీసీ నాయకుతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....... దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా లెక్కలతో పాటు బీసీల కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టి, ప్రతి కులానికి ప్రత్యేక యూనిక్ నంబర్ కేటాయించాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, అసెంబ్లీ, పార్లమెంట్, బడ్జెట్‌లో బీసీలకు తగిన వాటా కల్పించాలన్నారు. బీసీల హక్కుల సాధనకు భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా 12 మండలాల నుంచి వందలాది మంది ప్రతినిధులు మహాసభలకు హాజరుకానున్నారని తెలిపారు. మహాసభల విజయవంతానికి పోస్టర్లు, మైక్ ప్రచారం, ప్రచార జాతా తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొత్తపల్లి కోటిలింగాచారి, పరికి కోర్నేలు, కడియాల క్రాంతికుమార్, బొద్దుల దశరథం, పున్నం రాజు, మేరగుర్తు సారయ్య, పరికి బాబురావు, పరికి సత్యం, దిండు భరత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


