కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

కూలీల ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు

దౌల్తాబాద్,సిద్దిపేట:  పెయింటింగ్‌ పనుల కోసం కూలీలను తీసుకెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటన దౌల్తాబాద్ మండలం లింగరాజ్‌పల్లి శివారులో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు గాయపడ్డారు. సూరంపల్లి గ్రామంలో పెయింటింగ్‌ పనుల నిమిత్తం కూలీలతో ఆటో వెళ్తుండగా లింగరాజ్‌పల్లి శివారులోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో తూప్రాన్‌ మండల కేంద్రానికి చెందిన ఎల్లం కుడి భుజానికి తీవ్ర గాయమైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జితేందర్‌ కుడికాలి మడమకు గాయమైందని తెలిసింది. సమాచారం అందుకున్న 108 అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వారిని మెరుగైన వైద్యం కోసం తూప్రాన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది ఈఎంటీ భాను, పైలట్‌ నర్సింలు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News