సమాజ ఐక్యతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ లక్ష్యం,
- యూవత విద్యాభివృధి లో ముందుండాలి,
- చెడు వ్యాసనాలకు దూరంగా ఉండాలి,
- అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అజ్మీరా శ్యాంనాయక్,
- జాదవ్ చందు గారికి ఘన నివాళులు అర్పించిన అజ్మీరా శ్యామ్ నాయక్,
లింగాపూర్ : లింగాపూర్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన కీ. శే.జాదవ్ చందు గారి పెద్ద కర్మ (తెర్వి )కార్యక్రమానికి అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, ఆసిఫాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ హాజరై కీ. శే.జాదవ్ చందు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ జాదవ్ చందు గారి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకుమనోధైర్యంకల్పించారు. జాదవ్ చందు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున పెద్ద కర్మ కార్యక్రమానికి హాజరైన అజ్మీరా శ్యామ్ నాయక్, కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సంఘం తరఫున అండగా ఉంటామని తెలిపారు. సమాజంలో ప్రతి కుటుంబం కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం అవసరమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రవీందర్, ఉప సర్పంచ్ ఫోరమ్ జిల్లా అధ్యక్షులు ముండే దీపక్, అల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ రవీందర్,అల్ ఇండియా బంజారా సేవా సంఘ్,మండల అధ్యక్షులు చౌహన్ గునవంత్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాదవ్ రమేష్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ బలిరామ్, ఆడే బాబు లెక్చరర్, జాదవ్ చందు కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


