ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారానికి శ్రీకారం
- దామరంచ సర్పంచ్ నాగమణివిఠల్ గౌడ్
వెల్దుర్తి :వెల్దుర్తి మండలం దామరంచ గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కోసం బియ్యం, అల్పాహార, మధ్యాహ్న భోజన పథకాన్ని గ్రామ సర్పంచ్ నాగమణి విఠల్ గౌడ్ ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ నాగమణి విఠల్ గౌడ్ మాట్లాడుతూ - ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు పోషకా హారం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టిందని, దీనివల్ల విద్యార్థుల్లో హాజరు శాతం పెరగడంతో పాటు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు.ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని వంట సిబ్బందికి సూచించారు.అనంతరం విద్యార్థులతో కలిసి సర్పంచ్ అల్పాహారం, భోజనం చేశారు. విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిరంజీవి, ఉపాధ్యాయులు, పాఠశాల చైర్మన్ రాజేశ్వరి వార్డు సభ్యులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


