మక్తల్‌లో ఇరిగేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ

మక్తల్‌లో ఇరిగేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ

-రూ.4 కోట్లతో ఆధునిక భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టిన మంత్రి వాకిటి శ్రీహరి.

మక్తల్, : మక్తల్ పట్టణంలో రూ.4 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న ఇరిగేషన్ శాఖ భవన నిర్మాణానికి రాష్ట్ర పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖ క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి బుధవారం భూమిపూజ చేశారు. అధికారులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది విధుల నిర్వహణకు మెరుగైన వసతులు కల్పించేందుకు నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మక్తల్ పట్టణంలోని ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలాల్లో గోదాముల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించినట్లు మంత్రి తెలిపారు. గోదాముల నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రియాంకకు సూచించారు. అదేవిధంగా మక్తల్‌ పట్టణంలో  మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి అవసరమైన మున్సిపల్ స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను మంత్రి సూచించారు. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పేర్కొన్నారు. సాగునీరు, రహదారులు, విద్యుత్ తదితర మౌలిక వసతులను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.  ఈ కార్యక్రమంలో  మక్తల్ మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, నీటి పారుదల శాఖ ఈ ఈ గోపాల చారీ, డీ ఈ ఈ లు సురేష్,మహేశ్, శివుడు, వెంకట రమణ, శేఖర్, ఏ. ఈ లు , వార్డు కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-07 at 5.26.14 PM (1)

Views: 19

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News