ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి బ్యూరో : ఈవీఎం గోదామును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. కామారెడ్డి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరిచిన ఈవీఎం గోదాము వద్ద పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కామారెడ్డి జిల్లాలోని ఈవీఎం గోదామును నెలవారీ తనిఖీలో భాగంగా ఎన్నికల విభాగం అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గోదాము వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరు తదితర అంశాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎం గోదాము వద్ద పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పటిష్టమైన బందోబస్తు కొనసాగించాలని సూచించారు. గోదాము పరిసరాలను 24 గంటల పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి,తహసీల్దార్ హిమబిందు, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


