జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

 జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్   నాగర్ కర్నూల్ జిల్లాలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సోమవారం పర్యటించారు. జిల్లా కేంద్రం సమీపంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.

గొర్రెల పెంపకం యూనిట్ పరిశీలన:
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ఆధ్వర్యంలోని గొర్రెల పెంపకం యూనిట్ ను పరిశీలించారు. గొర్రెల ఆరోగ్య పరిస్థితి, వయస్సు, దాణా, సంరక్షణ చర్యలపై అధికారులను ఆరా తీశారు. ప్రస్తుతం యూనిట్ లో 5-6 నెలల వయస్సు గల గొర్రె పిల్లలు ఉన్నాయని, మరో 1-2 నెలల్లో 28-30 కిలోల బరువుకు చేరుకుంటాయని అధికారులు వివరించారు. దాణా నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని, పశువైద్య అధికారుల సమన్వయంతో టీకాలు అందించాలని ఆదేశించారు.

పెట్రోల్ బంక్ పరిశీలన:
వనపట్ల శివారులో PACS ఆధ్వర్యంలో నిర్మిస్తున్న పెట్రోల్ బంక్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు.

గానుగ నూనె కేంద్రం పరిశీలన:
తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు గ్రామంలోని గానుగ నూనె ఉత్పత్తి, అమ్మకం కేంద్రాన్ని పరిశీలించారు. నూనె తయారీ ప్రక్రియ, ఉత్పత్తి, మార్కెటింగ్, విక్రయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యతను కొనసాగిస్తూ మార్కెటింగ్ ను మరింత విస్తరించాలని సూచించారు. జిల్లాలో గొర్రెల పెంపకానికి మంచి అవకాశాలు ఉన్నందున సహకార సంఘాలను బలోపేతం చేయాలని, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

 

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News