ఐటీఐ అభ్యర్థులకు అప్రెంటిషిప్ మేళా
కొత్తగూడెం బ్యూరో,:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులకు అప్రెంటిషిప్ శిక్షణ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిషిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెం ప్రిన్సిపాల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ/ప్రైవేట్ ఐటీఐల నోడల్ అధికారి జి. రమేశ్ తెలిపారు. ఈ మేళాను అక్టోబర్ 12న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ, కొత్తగూడెంలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని వివిధ పరిశ్రమల్లో అప్రెంటిషిప్ శిక్షణ పొందేందుకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ మేళాను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకావచ్చని సూచించారు. అభ్యర్థులు ముందుగా www.apprenticeshipindia.org.in వెబ్‌సైట్‌లో తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. అనంతరం రిజిస్ట్రేషన్ కాపీ, బయోడేటా, సంబంధిత విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో మేళాకు హాజరు కావాలని సూచించారు. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల ప్రిన్సిపాళ్లు, వివిధ పరిశ్రమల యాజమాన్యాలు తమ సంస్థల్లో అందుబాటులో ఉన్న అప్రెంటిషిప్ ఖాళీల వివరాలతో అక్టోబర్ 12న ఉదయం 10 గంటలకు ప్రభుత్వ ఐటీఐ కొత్తగూడెంలో హాజరుకావాలని కోరారు. ఐటీఐ పూర్తి చేసిన యువతకు పరిశ్రమల్లో ప్రాక్టికల్ శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలకు మార్గం సుగమం చేసే ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని జి. రమేశ్ కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


