పదో తరగతి పరీక్షల పాత పేపర్ల అమ్మకానికి కొటేషన్ల గడువు పొడిగింపు: డీఈవో పి. చంద్రయ్య

పదో తరగతి పరీక్షల పాత పేపర్ల అమ్మకానికి కొటేషన్ల గడువు పొడిగింపు: డీఈవో పి. చంద్రయ్య

నస్పూర్ (మంచిర్యాల): పదవ తరగతి పబ్లిక్ పరీక్షల మార్చి 2025 మరియు జూన్ 2025 స్పాట్ వాల్యుయేషన్‌కు సంబంధించిన పాత సమాధాన పత్రాలను విక్రయించేందుకు స్థానిక వ్యాపారుల నుంచి కోరే కొటేషన్ల గడువును పొడిగించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో నిర్ణయించిన గడువును తేదీ 13.10.2026 (మంగళవారం) వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత పేపర్లు కొనదలచిన ఆసక్తిగల వ్యాపారులు ఈ క్రింది నిబంధనలను పాటించాలని సూచించారు. ధరావత్తు సొమ్ము అక్షరాల పది వేల రూపాయలు మాత్రమే "జిల్లా విద్యాశాఖ అధికారి, మంచిర్యాల" పేరు మీద డిమాండ్ డ్రాఫ్ట్ (డీ.డీ) రూపంలో తీసుకోవాలి. కొటేషన్ సమర్పణ: కిలో పేపరు కొనుగోలు చేసే ధరను స్పష్టంగా పేర్కొంటూ సీల్డ్ కవర్లో ఉంచాలి. డీ.డీ మరియు కొటేషన్ కవర్‌ను జత చేసి సమర్పించాలి. చివరి తేదీ 13.10.2026 (మంగళవారం) సమయం సాయంత్రం 4:00 గంటల లోపు మంచిర్యాలలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయము (ఐడీఓసీ) నందు నేరుగా హాజరై అందజేయాల్సి ఉంటుంది. నిర్దేశిత సమయం దాటిన తర్వాత వచ్చిన కొటేషన్లు స్వీకరించబడవని జిల్లా విద్యాశాఖ అధికారి పి. చంద్రయ్య స్పష్టం చేశారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News