తెలంగాణ ప్రభుత్వము — వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ
మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం "ఆగస్టు,సెప్టెంబర్ 2026 పాల్ సెషన్" దరఖాస్తు గడువు పెంపు.
నస్పూర్ (మంచిర్యాల): విదేశాలలో మాస్టర్స్ లేదా డాక్టరేట్ వంటి ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే బి.సి మరియు ఇ.బి.సి విద్యార్థులకు ముఖ్య గమనిక. మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీని 30.09.2026 నుండి 15.10.2026 వరకు మరో 15 రోజుల పాటు పొడిగించడం జరిగింది. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది. ముఖ్యమైన అర్హతలు: కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వర్గాల నుండి కలిపి ఐదు లక్షల కంటే తక్కువగా ఉండాలి. దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థి వయస్సు 35 సంవత్సరాలు దాటకూడదు. డిగ్రీలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
ఎంట్రన్స్ టెస్ట్ అర్హత:
GRE లో కనీసం 260 మార్కులు లేదా GMAT లో కనీసం 500 మార్కులు సాధించాలి. భాషా ప్రావీణ్యత పరీక్షలో TOEFL 50 మార్కులు, IELTS 6.0 , బ్యాండ్లు PTE 50 మార్కులు తప్పనిసరి. అర్హులైన వారు 15.10.2026 లోపు క్రింది ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.telanganaepass.cgg.gov.in
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


