ఎల్‌నినో ప్రభావంతో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలి
వేరుశనగ విత్తనాల పంపిణీలో మంత్రి వాకిటి శ్రీహరి
మక్తల్ లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జాతీయ నూనె గింజల పథకం ద్వారా రైతులకు వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయే పరిస్థితి నెలకొంటున్నందున రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు దృష్టి సారించాలని కోరారు. రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలిపారు. నూనె గింజల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వాకిటి శ్రీహరి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


