ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలి

ముఖ్యమంత్రి కుటుంబంపై అసత్య ప్రచారాన్ని అరికట్టాలి

ఎస్పీకి వినతిపత్రం అందజేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ సుహాసిని రెడ్డి

శివ్వంపేట : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియా వేదికగా, ముఖ్యంగా ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా అసత్య, నిరాధార, వాస్తవాలకు విరుద్ధమైన ఆరోపణలు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న వీడియో లు, పోస్టుల వాస్తవికతపై సమగ్రంగా విచారణ చేపట్టి, ప్రజల్లో అపోహలు, గందరగోళం కలిగించేలా తప్పుడు సమాచా రాన్ని ప్రచారం చేస్తున్న వ్యక్తులు, సంబంధిత యూట్యూబ్ ఛానళ్లపై నిఘా ఉంచాలని వారు కోరారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేసినట్లు తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధికార ప్రతినిధి బండారి గంగాధర్, మాచినూరి శ్రీశైలం యాదవ్, కొండి దుర్గేష్, బెస్త చిరంజీవులు, కుమ్మరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News