మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి

మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలి


మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్

మక్తల్ మున్సిపాలిటీలో జరిగిన అవినీతి అక్రమలపైన సంబంధించిన అధికారులు స్పందించి వెంటనే విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు బుధవారం వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక మున్సిపాలిటీలో 16 వార్డుల్లో ఎలాంటి పర్మిషన్ లేకుండా ఒక్కొక్క వార్డులో లక్ష రూపాయలు చొప్పున కేటాయించుకొని పనులు చేయకుండానే బిల్లులు ఎత్తుకోవడం జరిగిందని ఆయన ఆరోపించారు అదేవిధంగా ఈ మధ్యకాలంలో 12 మందిని అవుట్ సోర్సింగ్ కింద అధికారుల అనుమతి లేకుండా నియామకం చేసుకొని ఒక్కొక్కరి దగ్గర లక్ష నుంచి 2 లక్షల రూపాయలు వసూలు చేసిన చరిత్ర ఈ పాలకవర్గానికి దక్కుతుందని ఆయన విమర్శించారు విషయంపై న జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్య తీసుకోవాలని ఆయన కోరారు పట్టణంలో పారిశుద్ధ్యం పనుల కోసం టెండర్లు వేసి ఆ పనులు చేయకుండా ప్రస్తుతము ఆ పనులలో మున్సిపాలిటీ సిబ్బందితో చేయించడం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు పాలకవర్గం మొదటి సంవత్సరం పూర్తి కాకముందే ఇలాంటి అక్రమాలకు అవినీతికి పాల్పడుతుంటే స్థానిక మంత్రి ఏం చేస్తున్నాడని ఆయన ప్రశ్నించారు అవినీతి అక్రమాల లో మంత్రి కి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందో ప్రజలకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు కాంగ్రెస్ పాలలో అవినీతి తప్ప అభివృద్ధి ఏం జరగడం లేదని రాష్ట్రంలో అదే పరిస్థితి నియోజకవర్గంలో అదే పరిస్థితి నెలకొంది అని ఆయన ఆరోపించారు మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం వలన పట్టణము అభివృద్ధి చెందుతుందని ఆశించాం కానీ ఇలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడడానికి కాంగ్రెస్ కు అధికారం ఇవ్వలేదని విషయాన్ని ఆ పార్టీ నాయకులు పాలకవర్గబ  ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు పట్టణంలో మంచినీటి కొరతతో పాటు పారిశుద్ధ్యం లోపం తీవ్రంగా ఉందని దీనిపైన పురపాలక కమిషనర్ ప్రత్యేక దృష్టి పెట్టాలి అని కోరారు ఈ విషయంపై సంబంధించిన అధికారులు స్పందించకపోతే భవిష్యత్తులో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.కార్యక్రమం లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఏ మహిపాల్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు చిన్న హనుమంతు, గుర్లపల్లి సర్పంచ్ గాలి రెడ్డి,మాజీ కౌన్సిలర్లు అన్వర్ హుస్సేను జగ్గలి రాములు, ఎరుకలు మొగిలప్ప,పార్టీ నాయకులు జుట్ల శంకరు, శివారెడ్డి, రఘు,అమ్రేష్, మనన్‌,రామలింగం, ఈశ్వర్ యాదవ్, అశోక్ కుమార్ యాదవ్,కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Views: 9

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News