గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేసిన అధికారులకు సన్మానం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

గణేష్ నిమజ్జనాన్ని విజయవంతం చేసిన అధికారులకు సన్మానం చేసిన మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్ పట్టణంలో ఇటీవల జరిగిన గణేష్ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడంలో సహకరించిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని ఎండీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సమన్వయంతో పనిచేసిన ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, పోలీస్ శాఖ అధికారులతో పాటు ప్రజలకు సమాచారాన్ని అందించిన మీడియా ప్రతినిధులకు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో అన్ని శాఖల సమన్వయం, పోలీసుల బందోబస్తు, మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ్య చర్యలు, విద్యుత్ శాఖ ముందస్తు ఏర్పాట్లు, వైద్య సిబ్బంది సేవలు, మీడియా సహకారం కీలకంగా నిలిచాయని పేర్కొన్నారు. ప్రజలు, ఉత్సవ కమిటీలు, అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్లే నిమజ్జన వేడుకలు విజయవంతంగా పూర్తయ్యాయని  మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.

Views: 35

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News