నాగర్ కర్నూల్ డిపోలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం
- బాణం గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి
నాగర్ కర్నూల్ :నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డిపోలోని అన్ని సెక్షన్ల ఉద్యోగులను కలిసి బాణం గుర్తుకు ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలను, రిటైర్మెంట్ అయిన ఉద్యోగుల బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని ప్రకటించారు. రాబోయే రోజుల్లో ఆర్టీసీలో బస్సుల సంఖ్య పెంచి, డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ ల నియామకాలు చేపడతామని వెల్లడించారు. మహబూబ్ నగర్ రీజియన్ జిల్లా అధ్యక్షులు వి.ఎస్. నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాణం గుర్తుకు రెండు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఆరు శ్రీనివాస్, డిపో చైర్మన్ పరుశురాం, డిపో అధ్యక్షులు బాబురావు, కార్యదర్శి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


