కౌడిపల్లి నూతన ఎసై గా నీరేష్.. జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ఎసై
మెదక్, కౌడిపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నూతన బాధ్యతలు స్వీకరించిన నీరేష్
బుధవారం మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ఐపీఎస్‌ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి మొక్కను అందజేశారు. కౌడిపల్లి పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్ఐగా విధులు నిర్వహించిన అమర్ జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరచుకొని, శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నేరాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పోలీస్ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంపొందించేలా అంకితభావంతో, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఎస్ఐ నీరేష్కు సూచించారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


