నిమ్స్‌లో అవినీతికి అడ్డూ అదుపు లేదా?

నిమ్స్‌లో అవినీతికి అడ్డూ అదుపు లేదా?

  • అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో అక్రమ వసూళ్లపై సమగ్ర విచారణ చేయాలి
  • పేషెంట్ల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు
  • అవినీతి సొమ్ము పంచుకుంటున్నారనే ఆరోపణలపై లోతైన దర్యాప్తు అవసరం
  • నిమ్స్ డైరెక్టర్  నైతికభద్యత వహించి వెంటనే రాజీనామ  చేయాలి
  • ఎంసిపిఐ(సి) రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి

హుస్నాబాద్, : నిమ్స్ ఆసుపత్రిలో అవినీతి, అక్రమ వసూళ్లు, పేషెంట్ల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమగ్ర విచారణ జరిపించాలని ఎంసిపిఐ(సి) రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెంటనే జోక్యం చేసుకుని ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిమ్స్‌లో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల నియామకాల పేరుతో ఒక్కో అభ్యర్థి నుంచి రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇటీవల ఈ వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేవలం ఒకరి అరెస్టుతో వ్యవహారాన్ని ముగించకుండా, అక్రమ వసూళ్ల వెనుక ఉన్న మొత్తం వ్యవస్థపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. నిమ్స్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని ప్రముఖ ఆసుపత్రిలో సిబ్బందిపై పర్యవేక్షణ లోపించడంతో అవినీతికి ప్రతి పనికి ఒక రేటు నిర్ణయించినట్లుగా పరిస్థితి తయారైందనే ఆరోపణలు వస్తున్నాయని ఆయన అన్నారు. అవినీతి సొమ్మును పలువురు కలిసి పంచుకుంటున్నారనే ఆరోపణలపై కూడా ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని కోరారు. సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. డాక్టర్లు సూచనలు చేసినా నర్సింగ్ సిబ్బంది పట్టించుకోకపోవడం, నర్సులు చెప్పినా ఇతర సహాయక సిబ్బంది స్పందించకపోవడం వంటి పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. చివరకు రోగులను పట్టించుకునే వారు లేని పరిస్థితి ఏర్పడటం ఆందోళనకరమన్నారు వైద్యం కోసం నిమ్స్‌కు వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలను గౌరవంగా చూడాల్సిన సిబ్బంది కొందరు నిర్లక్ష్యంగా, అమానవీయంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో తక్కువ సమయంలో పూర్తయ్యే కొన్ని వైద్య ప్రక్రియలు కూడా సిబ్బంది నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగా నిమ్స్‌లో ఎక్కువ కాలం కొనసాగుతున్నాయనే ఆరోపణలపై వాస్తవాలను అధికారులు పరిశీలించాలని కోరారు. పేషెంట్లు, వారి బంధువులు సిబ్బందిపై ఫిర్యాదు చేస్తామని చెప్పినా పట్టించుకోని పరిస్థితి ఉందని ఆరోపించారు. ఎల్‌ఓసీ, ఎస్టిమేట్ ఫారాల విషయంలో పేషెంట్లను ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఫిర్యాదులపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా గౌతమి అనే సిబ్బందిపై ఎల్‌ఓసీ విషయంలో పేషెంట్లను ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నందున, వాటిపై అధికారులు వాస్తవాలను నిర్ధారించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల నిమ్స్ అదనవు  సూపర్ఇండెంట్ లక్ష్మీ భాస్కర్ అరెస్టుకు సంబంధించిన అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఈ కేసులో ఇతరుల ప్రమేయం ఉందనే ఆరోపణలపైనా సమగ్ర దర్యాప్తు జరిపించాలని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అరెస్టుతోనే విచారణను ముగించకుండా, ఆరోపణలకు సంబంధించిన వ్యక్తుల పాత్ర, ఆర్థిక లావాదేవీలు, నియామక ప్రక్రియ, సంబంధిత అధికారుల పర్యవేక్షణ తదితర అంశాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని కోరారు. ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా, పేదలకు అందాల్సిన వైద్య సేవలు సక్రమంగా అందేలా నిమ్స్‌లో పారదర్శకమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లింగంపల్లి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమ వసూళ్లు, సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి, విచారణ నివేదికను ప్రజలకు వెల్లడించాలని కోరారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి