ఆదిలాబాద్ జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం

ఆదిలాబాద్ జిల్లా జైలులో ఘనంగా ఖైదీల సంక్షేమ దినోత్సవం

ఆదిలాబాద్ బ్యూరో :  ఖైదీల సంస్కరణే ధ్యేయం మని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్థానిక జిల్లా జైలులో నిర్వహించిన ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి వరంగల్ రేంజ్ ప్రిజన్స్ డి.ఐ.జి. ఎం. సంపత్, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ, జైళ్లలోని ఖైదీల పునరావాసం, వారిలో సానుకూల పరివర్తన తీసుకురావడానికి అధికారులు నిరంతరం కృషి చేయాలని అన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుల వలన కుటుంబాలకు దూరంగా ఉండడమే కాకుండా మానసికంగా, ఆర్థికంగా నష్టపోవడం జరుగుతుందని వెల్లడించారు. ప్రతి రోజు యోగ, పుస్తక పఠనం వంటివి దినచర్యగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. జైలు జీవితం ఖైదీల జీవితాల్లో మార్పునకు వేదిక కావాలని, సత్ప్రవర్తనతో సమాజంలో మెలగాలని సూచించారు.  వరంగల్ రేంజ్ ప్రిజన్స్ డి.ఐ.జి. ఎం. సంపత్ మాట్లాడుతూ, ఖైదీలలో నైతిక విలువలను పెంపొందించడానికి, వారు సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి జైలు అధికారులు చేస్తున్న సేవలను కొనియాడారు.  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు నేరస్థుల పునరావాసంలో పోలీసు, జైళ్ల శాఖల సమన్వయం ఎంతైనా అవసరమని అన్నారు. అనంతరం ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన ఖైదీలకు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జైలు సూపరింటెండెంట్ పి. గోపిరెడ్డి, డిఎంహెచ్ఓ సాధన, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి బి. హుస్సేన్, జైలర్ ఎన్. చంద్రశేఖర్, ఖైదీలు, జైలు అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-10-02 at 1.39.17 PM

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి