జాలిగామలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు 

జాలిగామలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు 

  • పంచాయతీ కార్మికులకు బట్టలు పంపిణీ
  • వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్" పై ప్రత్యేక గ్రామసభ
  • గ్రామ సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్

WhatsApp Image 2026-10-02 at 11.29.51 AMసిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం జాలిగామ గ్రామంలో శుక్రవారం రోజు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ తాళ్ల సునీత ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ సమాజ సేవకు, పరిశుభ్రతకు గాంధీజీ చూపిన మార్గం అనుసరణీయమని పేర్కొన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ నిరంతరం శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల సేవలు అభినందనీయమని కొనియాడారు. వారి సేవలను గుర్తించి, ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే నూతన వస్త్రాలు అందజేసినట్లు తెలిపారు. అనంతరం గ్రామంలో "వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్" పై ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్వతోముఖాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై సభలో విస్తృతంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి, గ్రామాభివృద్ధి కమిటీ నాయకులు, పంచాయతీ సిబ్బంది, అంగన్వాడి టీచర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
హనుమకొండ న్యూస్ : జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హనుమకొండ బాలసముద్రంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో గాంధీ జయంతి...
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఇకపై ప్రతి శనివారం బ్యాంకులకు సెలవు
సోన్పల్లి లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న వ్యక్తి
బీజేపీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ లో స్వచ్ఛ భారత్
గ్రామసభల్లో ఇంకుడు గుంతలు, ఫామ్‌ పాండ్ల ఏర్పాటుపై అవగాహన
తపస్ ఆధ్వర్యంలో  లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి