సమిష్టిగా పని చేసి ఐదు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ జెండా ఎగురేయండి... కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి

కాంగ్రెస్ లో వర్గాలు లేవు ఉన్నది కాంగ్రెస్ వర్గమే ,నీలం మధు ముదిరాజ్

WhatsApp Image 2026-01-24 at 12.50.12 PM

 

జిన్నారం   : సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందని కార్మిక శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు.పటాన్ చెరు నియోజకవర్గంలోని ముత్తంగి పీ ఎస్ అర్ గార్డెన్స్ లో ఇంద్రేశం,ఇస్నాపూర్ మున్సిపాలిటీలు, జిన్నారం ఎన్ ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో గుమ్మడిదల, జిన్నారం, గడ్డ పోతారం మున్సిపాలిటీల కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా హాజరైన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తాను వ్యక్తిగతంగా నిర్వహించిన సర్వేలో పటాన్ చెరులో కాంగ్రెస్ కె అనుకూలంగా ఉందన్నారు. గెలుపు గుర్రాలకు టిక్కెట్లు ఇచ్చి అందరూ సమిష్టిగా కష్టపడి పనిచేస్తే ఐదు మున్సిపాలిటీల పై కాంగ్రెస్ జెండా ఎగురవేయవచ్చని ధీమా వ్యక్తం చేశారు. ఇందిరమ్మ స్పూర్తితో తెలంగాణలో సాగుతున్న ప్రజా పాలనను ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. బీ అర్ ఎస్ పార్టీ కేటీఆర్ నాయకత్వంలో వరుస ఓటములు ఎదురవుతున్న  సోషల్ మీడియా ద్వారా అవాస్తవలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. ఆ పార్టీ సోషల్ మీడియాను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సోషల్ మీడియాను బలోపేతం చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి అభివృద్ధి, సంక్షేమం తో లబ్ది చేకూరుతుందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పార్టీ గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ల విషయంలో తీవ్ర పోటీ నెలకొందని,
క్షేత్ర స్థాయిలో ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు సమిష్టి నిర్ణయంతో గెలుపు గుర్రాలకు టిక్కెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. టిక్కెట్లు దక్కని నేతలు అసంతృప్తి కి గురికాకుండా పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని కోరారు. ఆ నాయకులకు అభివృద్ధి పనులలో భాగస్వామ్యం చేయడంతో పాటు పార్టీ పదవులలో పెద్దపీట వేసి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మెదక్ పార్లమెంటు ఇంచార్జి నీలం మధు మాట్లాడుతూ కొందరు నాయకులు పనిగట్టుకుని కాంగ్రెస్ లో వర్గాలు ఉన్నాయని కార్యకర్తలను అయోమయానికి గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు, కానీ కాంగ్రెస్ లో వర్గాలు లేవని ఉన్నది ఒక్కటి కాంగ్రెస్ పార్టీ వర్గమేనని స్పష్టం చేశారు. అందరి ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఖరారు చేసి ఐదు మున్సిపాలిటీల పై కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు.
కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకు మంచి రోజులు రాబోతున్నాయని పార్టీ కోసం కష్టపడి పని చేస్తున్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎక్కడ టిక్కెట్ల కేటాయింపు జరగలేదని అందరి అభిప్రాయాలను తీసుకుని  గెలిచే నాయకులకు టిక్కెట్లు కేటాయిస్తామన్నారు. టిక్కెట్ దక్కని నాయకులు నిరుత్సాహపడకుండా పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించి వారి గెలుపు కోసం పని చేయాలని కోరారు. టిక్కెట్లు రాని నాయకులకు పార్టీ పదవులలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ కలిసి కట్టుగా పనిచేసి కాంగ్రెస్ గెలుపుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు గాలి అనిల్ కుమార్, జనరల్ సెక్రటరీలు శశికళ యాదవ రెడ్డి, చిన్న ముదిరాజ్, కార్పొరేటర్ పుష్ప నగేష్, మండల , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Views: 26

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గ్రామీణ యువత క్రీడా ప్రతిభకు వేదిక – సీఎం కప్ 2026 -ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్ :- గ్రామీణ ప్రాంత యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి రాష్ట్ర స్థాయి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న...
రణదీవెనగర్ లో CPM అభ్యర్థి గెలుపును కాంక్షిస్తూ సిపిఎం జిల్లా నాయకుల ప్రచారం
అభివృద్ధి చూసి ఆదరించండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి,
జ్యోతిర్లింగాల దర్శనంకు బయలుదేరిన వాసవి సంఘం సభ్యులు
6వ వార్డు సమగ్ర అభివృద్ధికి వారధినై ఉంటా నేనావత్ రాజ్ కుమార్ (రాజ్ సర్కార్)
బుద్దాగూడలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన సర్పంచ్ స్వాతి జగన్నాథ్
అధికార పార్టీని ఆదరించండి వేగంగా అభివృద్ధి చేస్తా. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి