వర్షాకాలంలో లడ్డు సత్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు

వర్షాకాలంలో లడ్డు సత్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు

వేములవాడ, జూలై 23:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లడ్డు సత్రంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ఆహార పదార్థాల తయారీలో అత్యున్నత పరిశుభ్రత ప్రమాణాలు పాటించేలా లడ్డు సత్రం పరిసరాలను పూర్తిస్థాయిలో శుభ్రపరిచారు. లడ్డు కౌంటర్, పులిహోర తయారీ విభాగం, లడ్డు తయారీకి ఉపయోగించే పాత్రలు, ఇతర ఆహార పదార్థాల తయారీ ప్రాంతాలను వేడి నీటితో శుభ్రపరిచి, శానిటైజింగ్ ద్రావణాలతో పరిశుభ్రం చేశారు. అదేవిధంగా ఆహార పదార్థాల తయారీ హాల్స్, నిల్వ గదులు, పని ప్రదేశాలు, ఇతర విభాగాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు. సిబ్బంది పని చేసే ప్రాంతాలను కూడా పూర్తిస్థాయిలో శుభ్రపరచి పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఎల్. రమాదేవి ఆదేశాల మేరకు లడ్డు సత్రం పర్యవేక్షకులు పచ్చునూరి రాజేందర్, సత్రం ఇన్‌చార్జి బొడుసు మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లడ్డు సత్రం సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది పాల్గొని పారిశుద్ధ్య చర్యలను సమర్థవంతంగా అమలు చేశారు. భక్తులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ప్రసాదాలను అందించాలనే లక్ష్యంతో దేవస్థానం తరచూ ఇటువంటి ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Views: 20

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు