పేదల మనసులు చెదరని ముద్ర వై ఎస్ రాజశేఖర్ రెడ్డి
వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొన్న మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డిసిసి కార్యాలయం లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేకర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్లే రాజ్ గొండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు హాజరై వారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పేదల లకు పెద్దన్నాల ఆదుకున్న మహనీయుడు వై ఎస్ అని వారు చేసిన సేవలను కొనియాడారు. ఇందిరమ్మ ఇండ్లు,విద్యార్థులకుఫీస్ రియాంబర్స్ మెంట్, 108 అంబులెన్సు, 2 లక్షల రుణమాఫీ లాంటి ఎన్నో కార్యక్రమలు తీసుకొచ్చి పేదల మనసులో చెదరని ముద్ర వేసుకున్నరన్నారు. కార్యక్రమంలోఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజక వర్గ ఇంచార్జి ఆడే గజేంద్ర, డిసిసిబి మాజీ చైర్మన్ ఆడి భోజారెడ్డి,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


