వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం 

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం 

  • వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు
  • మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకుల వెల్లడి

చౌటకూర్  :- వెయ్యి రోజుల కాంగ్రెస్ వైఫల్యాల పాలనను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు బీఆర్ఎస్ మండల నాయకులు తెలిపారు. మండల కేంద్రమైన చౌటకూర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చౌకంపల్లి శివకుమార్, ఎంపీపీ మాజీ ఉపాధ్యక్షుడు గాజుల వీరేందర్ మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులవుతున్నా ఏ ఒక్క హామీని సక్రమంగా అమలు చేయలేదని వారు ఆరోపించారు. కేసీఆర్ కంటే మెరుగైన పాలన అందిస్తామని నమ్మించి, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని విమర్శించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు ఇలా అన్ని వర్గాలను మోసం చేస్తూ... కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం సొంత ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని నేతలు స్పష్టం చేశారు. ఇచ్చిన 420 హామీలను విస్మరించినందుకు నిరసనగా భారీ ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతామన్నారు. అలాగే మండల కేంద్రాల్లో ప్రజావాణి ద్వారా దరఖాస్తులు అందజేసి, పెండింగ్ సమస్యలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. నిరుద్యోగులను సైతం మోసం చేసిన ఈ ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడతామన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News