ఘనంగా వైఎస్సార్ వర్ధంతి
నివాళులర్పించిన డీసీసీ అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు
హన్మకొండ న్యూస్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించు కుని హన్మకొండలోని డీసీసీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించారు. హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ నివాళి కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్. నాగరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్, భత్తిని శ్రీనివాస్ రావు, వరంగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి ప్రియాంక, ఐవైసీ జాతీయ కార్యదర్శి గొట్టిముక్కుల సాగరిక, డీసీసీ మీడియా కమిటీ చైర్మన్ మార్క విజయ్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఆయన చేసిన ప్రజాసేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పీసీసీ, డీసీసీ కమిటీ సభ్యులు, మండల, పట్టణ, డివిజన్ కాంగ్రెస్ కమిటీల ప్రస్తుత, మాజీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


