వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు

గంభీరావుపేట  : గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతి గౌడ్ ఆదేశాల మేరకు బుధవారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయులు డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి  వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి, కొద్దిసేపు మౌనం పాటిస్తూ ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ.. డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి  పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి సామాన్య ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ మండల జనరల్ సెక్రెటరీ బంగ్లా రాజు గౌడ్, ఎండి తాహెర్ మండల కార్యదర్శిలు గుర్రం రాజు గౌడ్ టేకుమల్ల ప్రవీణ్, శనిగరపు నరేష్ వర్మ,  ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు మల్యాల రాజ్వీర్ , మండల యువజన నాయకులు గుర్రం రాజు గౌడ్, ఫాక్స్ డైరెక్టర్ రాగుల అంజిరెడ్డి, పార్టీ సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ శనిగరపు శంకర్, యువ నాయకులు దేశెట్టి రాజశేఖర్, పార్టీ సీనియర్ నాయకులు పిట్ల వెంకటి, చెరాల పవన్ గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్,గుడి కాడి కుమార్, మరియు బాలయ్య తో పాటు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News