బండి కిష్టమ్మ కుటుంబానికి అంబేద్కర్ యువజన సంఘం ఆర్థిక సాయం

మిడ్జిల్: మిడ్జిల్, మండల కేంద్రానికి చెందిన బండి కిష్టమ్మ ఇటీవల మృతి చెందడంతో, ఆమె కుటుంబ సభ్యులకు మిడ్జిల్ టౌన్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేశారు. కిష్టమ్మ 10వ రోజు కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం కుటుంబానికి రూ.7,000 ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ కష్టకాలంలో బాధిత కుటుంబాలకు అండగా నిలవడం సామాజిక బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుదర్శన్ బరిగెల, అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు రవీంద్ర, రవీందర్, మాజీ వార్డు సభ్యులు దానయ్య, సంఘం సభ్యులు దాసు, విజయ్ భాస్కర్, సురేష్ కుమార్, ప్రభుదాస్, శేఖర్, రాజు, అశోక్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు. 

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News