అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్

అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడు అరెస్ట్

  • ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పేరుతో మోసాలు
  • దేశవ్యాప్తంగా 140 మంది బాధితుల వద్ద రూ.5.30 కోట్లకు పైగా మోసం
  • ఇచ్చోడకు చెందిన వ్యాపారి వద్ద రూ.2.18 లక్షల సైబర్ మోసం
  • నిందితుడి వద్ద రెండు మొబైల్ ఫోన్లు, రూ.1 లక్ష నగదు స్వాధీనం.
  • జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
  • ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు 

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ విక్రయాల పేరుతో సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాడిని జిల్లా  పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలో సుమారు 140 మంది బాధితులను మోసం చేసి రూ.5.30 కోట్లకు పైగా మోసానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, రూ.1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.వివరాలలో ఈ కేసులో బాధితుడు సమీర్ సయ్యద్ (25) S/o హఫీజ్ సయ్యద్, వృత్తి: వ్యాపారం, నివాసం: వడ్డూర్ గ్రామం, నేరడిగొండ మండలం, ప్రస్తుతం బర్కత్‌పుర కాలనీ, ఇచ్చోడ మండలం. బాధితుడు గత రెండు నెలలుగా శివాజీ చౌక్‌లోని సురక్ష హాస్పిటల్ సమీపంలో A to Z పేరుతో మొబైల్ షాప్ నిర్వహిస్తున్నాడు.గత జూలై 25న మొబైల్ ఛార్జర్లు, డిస్‌ప్లేలు, ఇతర యాక్సెసరీస్ అవసరం కావడంతో బాధితుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మొబైల్ స్పేర్ పార్ట్స్ కోసం వెతికాడు. ఈ క్రమంలో సేద్సమీర్ 4780 అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ద్వారా రాజ్ లీడ్ ముంబాయి పేరుతో ఉన్న మరో ఐడీని గుర్తించాడు. అందులో ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా, మొబైల్ స్పేర్ పార్ట్స్, యాక్సెసరీస్ అందుబాటులో ఉన్నాయని, ముందుగా ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తే కొరియర్ ద్వారా సరుకులు పంపిస్తామని నిందితులు నమ్మించారు.వారి మాటలను నమ్మిన బాధితుడు జూలై 25 నుంచి ఆగస్టు 8 వరకు పలు విడతల్లో వారు సూచించిన QR కోడ్ కు మొత్తం రూ.2,18,000 ఆన్‌లైన్‌లో చెల్లించాడు. అనంతరం నిందితులు వాట్సాప్ ద్వారా కొరియర్ రసీదును పంపించి, మజీ ష హెయిర్ ఎక్స్ప్రెస్ ద్వారా సరుకులు అందుతాయని తెలిపారు. రవాణా సమస్యల కారణంగా ఆలస్యం అవుతుందని చెబుతూ బాధితుడిని మరింత నమ్మించారు. ఆగస్టు 22న సమీపంలోనిమజిష హెయిర్ ఎక్స్ప్రెస్ కార్యాలయానికి వెళ్లి సరుకులు తీసుకోవాలని నిందితులు చెప్పడంతో బాధితుడు ఇచ్చోడ, ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆ కార్యాలయం కోసం వెతికాడు. అయితే అలాంటి కార్యాలయం కనిపించకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫిర్యాదు చేయడం జరిగింది .బాధితుడి ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. దర్యాప్తులో నిందితుడు దేశవ్యాప్తంగా ఇదే తరహాలో 19 రాష్ట్రాల్లో 140 మందిని మోసం చేసినట్లు, సుమారు 140 మంది బాధితుల వద్ద రూ.5,30,33,494 /- కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
అరెస్ట్ చేసిన నిందితుడు: 
ప్రకాశ్ కుమార్ (22) S/o హరిరామ్ జీ, వృత్తి: మొబైల్ షాప్ వ్యాపారం, నివాసం: కిలావా, దబల్, సాంచోర్, జాలోర్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రం.
స్వాధీనం చేసుకున్న ఆస్తి:
రూ 1 లక్ష నగదు,రెండు మొబైల్ ఫోన్లు,
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పత్రికా సమావేశం ఏర్పాటు చేసి కేసు వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సోషల్ మీడియా వేదికల్లో తక్కువ ధరలకు మొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర వస్తువులు అందిస్తామని చెప్పే వ్యక్తులను నమ్మి ముందుగా డబ్బులు చెల్లించవద్దని సూచించారు. ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసే సమయంలో విక్రేత వివరాలను పూర్తిగా పరిశీలించి, అనుమానాస్పద లింకులు, QR కోడ్లు లేదా వ్యక్తిగత ఖాతాలకు డబ్బులు పంపకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితులు ఎంత త్వరగా ఫిర్యాదు చేస్తే, మోసపోయిన మొత్తాన్ని నిలుపుదల చేసి తిరిగి పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే , ఇచ్చోడ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ కే. నరేష్ కుమార్, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపీకృష్ణ, సిబ్బంది మాజిద్, త్రిశూల్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.

Views: 18

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News