బొగ్గు ఉత్పత్తిలో మందమర్రి అగ్రగామి
మందమర్రి : ఆగస్టు నెల బొగ్గు ఉత్పత్తిలో మందమర్రి ఏరియా ఉత్పత్తి లక్ష్యాలను పూర్తి చేసి అగ్రమిగా నిలిచిందని ఏరియా జనరల్ మేనేజర్ రాధాకృష్ణ అన్నారు. ఏరియా వ్యాప్తంగా 105 శాతం బొగ్గు ఉత్పత్తి చేయగా,102 శాతం ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు మంగళవారం మీడియాతో చెప్పారు. అండర్ గ్రౌండ్ గనులలో ఉద్యోగుల గైర్హాజరు అధిగమించేందుకు యూనియన్ నాయకులతో కలిసి సమన్వయంతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆర్కే ఓసి ప్రాజెక్టు ఫేజ్ 2 క్లియరెన్స్ ఫైనల్ దశలో ఉందన్నారు. అలాగే జిఎం కార్యాలయంలో ఉద్యోగులకు క్యాడర్ స్కీం ప్రమోషన్ల ఉత్తర్వులను జిఎం రాధాకృష్ణ చేతుల మీదుగా అందించారు.ఈ కార్యక్రమంలో డీజీఎం పర్సనల్ సిహెచ్ అశోక్,డీజీఎం ఐఈడి కిరణ్ కుమార్,సీనియర్ పర్సనల్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


