నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ ధర్నా
నాగర్ కర్నూల్ : పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడవద్దని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


