విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ
ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ప్రగతి వివేకరావు ఆర్థిక సహకారం
ముత్తారం, : లక్కారం జడ్పీహెచ్‌ఎస్‌లో చదువుతున్న ఐదుగురు విద్యార్థినులకు ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ప్రగతి వివేకరావు ఆర్థిక సహకారం తో సైకిళ్లను పంపిణీ చేశారు.జిల్లా విద్యాధికారి జి.శారద విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు. మచ్చుపేట,శుక్రవారం పేట నుంచి ప్రతిరోజూ రెండు, మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్న విద్యార్థినుల ఇబ్బందిని హిందీ ఉపాధ్యాయురాలు కొప్పుల శైలజ దాత దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన డాక్టర్ ప్రగతి వివేకరావు ఐదు సైకిళ్లకు ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థులు నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పరచుకుని ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని డీఈవో శారద సూచించారు. దాతకు జిల్లా విద్యాశాఖ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఎంఈవో హరిప్రసాద్,హెచ్‌ఎం సుహాసిని,ఏఏపీసీ చైర్‌పర్సన్ సౌజన్య, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


