విద్యార్థులకు రజిత ఫౌండేషన్ షూస్ పంపిణీ
ముత్తారం : ముత్తారం మండలం ఓడేడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా షూస్ పంపిణీ చేశారు. రజిత ఫౌండేషన్ అధ్యక్షుడు మొగిలి శ్రీను సహకారంతో, గ్రామ సర్పంచ్ పోతిపెద్ది కవిత కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి షూస్ అందించిన ఫౌండేషన్ సేవలను పాఠశాల సిబ్బంది,తల్లిదండ్రులు అభినందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కవిత మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ దాసరి ప్రశాంత్‌గౌడ్, కార్యదర్శి బూర్ల రాజేందర్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ రత్న సురేష్,ఉపాధ్యాయులు శ్రీనివాస్,మాధవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


